టీటీడీ ఔట్  సోర్సు సిబ్బందికి టైం స్కేలు ఇవ్వాలి
 

- మల్లారపు నాగార్జున డిమాండ్
- మ్యాన్ పవర్ కార్పొరేషన్ లో విలీనం తగదు
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 3-  టీటీడీ అవుట్సోర్సింగ్ సిబ్బందికి టైమ్‌స్కేల్ వ‌ర్తింప చేయాల‌ని, శ్రీ వేంకటేశ్వర మ్యాన్ పవర్ కార్పొరేషన్  విధివిధానాలను ప్రకటించాలని ఆ ఎంప్లాయిస్ వేల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మల్లారపు నాగార్జున డిమాండ్ చేశారు.  టీటీడీ  ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్  వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం శుక్రవారం తిరుపతి యశోదా నగర్ లోని ఎంబి.భవనంలో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ మ్యాన్ పవర్ కార్పొరేషన్ లో  విలీనాన్ని అవుట్సోర్సింగ్ సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. శ్రీ‌వారినే న‌మ్ముకుని ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నార‌ని, వీరిని టీటీడీ నేరుగా కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న తీసుకోవాల‌ని కోరారు.  భ‌క్తుల‌కు ఎన‌లేని సేవ‌లందిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు అన్యాయం చేయ‌డం త‌గ‌ద‌న్నారు. ముఖ్యమంత్రి  ఇచ్చిన టైంస్కేల్ హామీని నెర‌వేర్చాల‌ని కోరారు. కొంతమంది అధికారులను ప్రత్యేకంగా కేటాయించి ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో బలవంతంగా సంతకాలు చేయిస్తుండటం బాధాకరమన్నారు. లేనిపక్షంలో విధులకు హాజరు కావద్దని బెదిరిస్తున్నారని చెప్పారు.            కార్పొరేషన్ విధివిధానాలు తెలపడం లేదని, ఏయే క్యాడర్లను, ఏయే విభాగాలను చేరుస్తారో కూడా తెలియజేయడం లేదన్నారు. సీనియారిటీని ఏ విధంగా పరిగణిస్తారో చెప్పాలన్నారు.
          ఈ సమావేశంలో టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు డైరెక్టర్లు గోల్కొండ వెంకటేశం,  కాటా గుణశేఖర్, టిటిడి ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, ఉపాధ్యక్షుడు రూప్ కుమార్, జాయింట్ సెక్రటరీ హ‌రి, నాయకులు నిరంజన్ బాబు, ఉద్యానవన విభాగం, ఆయుర్వేద కళాశాల, వెండార్స్, మెడికల్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, ధర్మగిరి వేదపాఠశాల, ఆలయాల మేళం సిబ్బంది, సెక్యూరిటి సిబ్బంది ఇతర అన్ని సొసైటీల సిబ్బంది  పాల్గొన్నారు.