6న కాంట్రాక్టు ఉద్యోగులు గుంటూరులో గర్జన
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 4-   ఏపీ డీఎస్సీ కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జేఏసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంటూరుజిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ఈనెల 6 న   కాంట్రాక్టు ఉద్యోగుల గర్జన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జేఏసీ నాయకుల బృందం కోరింది. కడప జిల్లాలోని యండవల్లిలో వారు శనివారం విలేకరులతో మాట్లాడారు. కడప నుంచి కూడా గుంటూరు తరలిరావాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో   జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాధరెడ్డి, జిల్లా నాయకులు గుగ్గిళ్ళ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి