మంత్రులకు వినతి పత్రాలివ్వండి

 

• గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పిలుపు

     (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

సెప్టెంబరు 5:ఈ నెల 16న ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ ఉన్న నేపథ్యంలో .. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించాలని కోరుతూ అన్ని జిల్లాలోని మంత్రులకు/ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఈ నెల 15 లోపు అందజేయాలని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం (VWSEA 361/2020) పిలుపునిచ్చింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. రాజేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ సూచనల మేరకు రాష్ట్ర కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి జి.సుదర్శనరాజు ఒక ప్రకటనలో తెలిపారు.