డిపార్టుమెంట్ పరీక్షలతో సంబంధం లేకుండా ప్రొబెషనరీ ఖరారు చేయాలి
 

- అజయ్ జైన్ కు వెంకట్రామిరెడ్డి వినతి
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
 సెప్టెంబరు 7-  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు డిపార్టుమెంట్  పరీక్షలతో సంబంధం లేకుండా ప్రొబెషనరీ ఖరారు చేయాలని గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ (13/2020) గౌరవాధ్యక్షులు కాకర్ల వెంకట్రామిరెడ్డి రాష్ట్ర జనరల్ సెక్రటరీ అంకమరావు,అడిషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బి. కిషోర్ లు డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ను కలిసి వారు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.  అందులోని అంశాలు ఇలా ఉన్నాయి...
- డిపార్టుమెంట్ పరీక్షల్లోఉత్తీర్ణులయితేనే ప్రొబెషనరీ ఖరారు చేస్తామని చెప్పినా, కరోనా కారణంగా ఆ పరీక్షలు సకాలంలో నిర్వహించలేదు.
- కొన్ని కేటగిరీ ఉద్యోగులకు నోటిఫికేషన్ లో, అపాయింట్ మెంటు సమయంలో  డిపార్టుమెంట్ పరీక్షల సంగతి పేర్కొనలేదు.
- పైగా సమయం తక్కువుగా ఉన్న పరిస్థితుల్లో సర్వీసు రూల్సు  సవరించి డిపార్టుమెంట్ పరీక్ష పాస్ అయితేనే ప్రొబెషన్ ఖరారు చేస్తామని చెప్పడం సరికాదు.
- సచివాలయ ఉద్యోగులందరినీ డిపార్టుమెంట్ పరీక్షతో సంబంధం లేకుండా ప్రొబెషనరీ ఖరారు చేసి పే స్కేలు వర్తింపజేయాలి.
మరో వైపు రాష్ర్టంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొబెషనరీ ఖరారుకు ప్రభుత్వం విధించిన నిబంధనలు కష్టతరంగా ఉన్నాయన్న విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నట్లు విప్పర్తి నిఖిల్ కృష్ణ తెలిపారు.  అసోసియేషన్ తరపున అన్ని కేడర్ల సచివాలయ ఉద్యోగులకు ప్రోబిషన్ డిక్లర్ చేస్తూ పే స్కెల్ ఇవ్వవలసినదిగా అనేకమంది రాష్ట్ర నాయకులను, రాష్ట్ర  అధికారులను  అసోసియేషన్ తరపున కలిసి వినతిపత్రాలు సమర్పించినట్లు నిఖిల్ కృష్ణ తెలిపారు.