డిగ్రీ కాలేజి లెక్చరర్ల సాధారణ బదిలీలకు  ముఖ్యమంత్రి ఆమోదం
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 7:  డిగ్రీ కాలేజి లెక్చరర్ల సాధారణ బదిలీలకు అవకాశం కల్పించే ప్రతిపాదనకు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె. వెంకట రామి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ ప్రతిపాదన ప్రకారం.. 2 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్నవారు బదిలీలకు అర్హత పొందుతారు.  5 సంవత్సరాలు సర్వీసు ఓకే చోట పూర్తి అయిన వారు తప్పని సరిగా బదిలీ అవుతారు.  30-06-2023 లోపల పదవి విరమణ పొందే వారికి బదిలీ నుంచి మిహాయింపు ఇస్తారు. డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు సాధారణ బదిలీల అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెంకట రామిరెడ్డి పేర్కొన్నారు.