గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు వద్దు
 

•    అక్టోబరు 2న నేరుగా ప్రొబేషన్  ప్రకటించాలి
•    గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ విజ్ఞప్తి
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 7:  ఎటువంటి పరీక్షలతో సంబంధం లేకుండా అక్టోబర్2న సచివాలయ ఉద్యోగులందరికీ ప్రొబేషన్ ప్రకటించాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆసిస్టెంట్లు,హెల్త్ సెక్రటరీలు,ఎ.యన్.యంలు,గ్రామ సర్వేయర్లు,ఇంజనీరింగ్ ఆసిసిస్టెంట్లు,వి.ఆర్.ఒలు,ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరి ఆసిస్టెంట్లు,సెరీ కల్చర్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు తదితర 11 విభాగాలవారికి ఎటువంటి పరీక్షతో సంబంధం నేరుగా అక్టోబర్2వ తేదీ న ప్రొబేషన్ ప్రకటించాలని  జాని పాషా.. అజయ్ జైన్ ను కోరారు. ఈ సందర్బంగా అజయ్ జైన్.. అన్ని విషయాలు స్పష్టంగా అడిగి వాటిపై సానుకూలంగా వివరణ ఇచ్చారు.  ఉద్యోగులకు ఎటువంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు.  శాఖా పరీక్షలు తప్పనిసరి అయిన పక్షంలో కనీసం ఒక సంవత్సరం గడువు ఇవ్వాలని, పరీక్షలు ఆంగ్ల, తెలుగు భాషల్లో నిర్వహించాలని కోరారు, అక్టోబర్2 నుంచి పే స్కేల్ వర్తింపజేయాలని కోరారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని, కారుణ్య నియామకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ విజయవాడ నగర అధ్యక్షుడు ఎం.శశిధర్,ఫెడరేషన్ నాయకులు మనోహర్,బి.శ్వేతా,సుజాత,జ్యోతి  తదితరులు పాల్గొన్నారు.