విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో ప్రయోజనాల చెల్లింపు
 

- బడ్జెట్ హెడ్ ఆఫ్ అకౌంట్లు ఖరారు
- ఉద్యోగుల కోసం ఎంతో చేస్తున్నాం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 10- ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసు నుంచి పదవీ విరమణ చేసిన, లేదా ఇతర కారణాల వల్ల వైదొలిగిన ఉద్యోగులకు రాష్ర్ట ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 2020 జనవరి  ఒకటి తర్వాత ఇలా ఉద్యోగం నుంచి బయటకు వెళ్లిన వారికి ప్రయోజనాలు కల్పించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకు బడ్జెట్ హెడ్ లు ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. గ్రాట్యుటీ, లీవు ఎన్ క్యాష్మెంటు తదితర ప్రయోజనాల చెల్లింపునకు ఈ ఏర్పాటు చేసింది. దీంతో సీఎఫ్ఎంఎస్ ద్వారా వీరికి నేరుగా ప్రయోజనాలు అందనున్నాయి.
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఏమేం ప్రయోజనాలు కల్పించిందో పేర్కొంటూ ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.
- ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం
- పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు
-  ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా వైద్య సేవలు
-కార్పొరేట్ శాలరీ ప్యాకేజీతో రూ.40 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.5 లక్షల బీమా, పిల్లల చదువుల , పెళ్లిళ్ల రుణాల మాఫీ
- ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల భవిష్యత్తు కోసం  సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ సొసైటీ ద్వారా ఆన్ లైన్ తరగతుల నిర్వహణ. ఇందులో సివిల్స్, గ్రూపు పరీక్షలకు శిక్షణ,
- కారుణ్యనియామకాలకు పచ్చజెండా, త్వరలోనే ప్రక్రియ ప్రారంభం.
- త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు.
- పీటీడీ ఉద్యోగులు కూడా సంస్థ అభివృద్ధికి అంతే చొరవతో, ఉత్సాహంతో పని చేయాలని ఆర్టీసీ వీసీ,ఎండీ ద్వారకాతిరుమల రావు పిలుపునిచ్చారు.

ఎక్కువ మందిచదివినవి