ఉపాధ్యాయులకు సెలవులు అన్నీ యథాతథం
 

- అందుకు తగ్గట్టు ఉత్తర్వులు
-దసరా సెలవుల్లో పదోన్నతులకు చర్యలు
- కమిషనర్ చినవీరభద్రుడి హామీ
- ఫ్యాప్టో చర్చల్లో అంగీకారం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 10- ఉపాధ్యాయుల సర్వీసు రూల్సుకు సంబంధించి ట్రైబ్యునల్ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతామని లేదా కొత్త నిబంధనలు రూపొందించి దసరా సెలవుల్లో అన్ని క్యాడర్లలో పదోన్నతులు కల్పిస్తామని విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు హామీ ఇచ్చారు. ఈ అకడమిక్ సంవత్సరంలో ఉన్న సెలవులన్నీ యథాతథంగా వినియోగించుకునేందుకు ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా కమిషనర్ అంగీకరించారు.
ఫ్యాప్టో  నేతలతో గురువారం ఆయన వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నేతలు ప్రకటించిన మేరకు ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
-   పాఠశాలల్లో అనేక రకాల యాప్ ల అప్ లోడింగు వల్ల విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నాయని ఫ్యాప్టో నేతలు పేర్కొనగా ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
- ఉన్నతీకరించిన పాఠశాలలకు 400 ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి
-  2002 పదోన్నతుల  సర్వీసు సమస్యలు పరిష్కారానికి అంగీకారం.
- వేసవిలో నాడు-నేడు పనులు నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు, టీచర్లకు సముపార్జిత సెలవు మంజూరుకు త్వరలో ఉత్తర్వులు.
- శానిటరీ పని వారికి నెలకు రూ.6,000 ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని కమిషనర్ వెల్లడి 
- ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానానికి త్వరలో ప్రభుత్వం నిర్ణయించిన తేదీ ప్రకారం కార్యక్రమాలు.
- స్కూళ్ల నిర్వహణ గ్రాంటు ఇవ్వడానికి అంగీకారం
ఈ సమావేశంలో ఎస్ సీ ఈ ఆర్ టీ డైరక్టర్ ప్రతాప్ రెడ్డి, ఇతర అధికారులు  ఫాప్టో  ఛైర్మన్ సి.హెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, సెక్రెటరీ జనరల్ సి.హెచ్ శరత్ చంద్ర, కో - చైర్మన్లు నక్కావెంకటేశ్వర్లు,వి.శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు ఏపీ జెఏసి సెక్రెటరీ జనరల్ జి.హృదయ రాజు, కార్యవర్గ సభ్యులు కె ఎస్ ఎస్ ప్రసాద్ లు పాల్గొన్నారు .