ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ సమీర్ శర్మ
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 10- ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్ ) గా  సమీర్ శర్మ కొత్తగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబరు 30న పదవీ విరమణ చేయనున్నారు.అక్టోబరు ఒకటి నుంచి సమీర్ శర్మ కొత్త సీఎస్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదిత్యనాథ్ దాస్ జూన్ నెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉండగా మరో నెలల పాటు ఆయన పదవీకాలం పొడిగించారు. దీంతో సెప్టెంబరు వరకు ఆయనకు అవకాశం దక్కింది. ఈ మధ్యనే సమీర్ శర్మ కేంద్ర సర్వీసుల నుంచి రాష్ర్టానికి వచ్చారు. సీఎస్ గా బాధ్యతలు అప్పగించే క్రమంలోనే ఆయన రాష్ర్టానికి వచ్చినట్లు తెలిసింది.
సమీర్ శర్మ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ లో అనేక కీలక పదవుల్లో గతంలో పని చేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు.

ఎక్కువ మందిచదివినవి