పి ఆర్ సి  పై త్వరలో సీఎంతో చర్చలు ఎన్జీవో నేత శ్రీనివాసరావు

(ఉద్యోగులు న్యూస్)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున పిఆర్సి తదితర డిమాండ్లపై 2 రోజుల్లో ముఖ్యమంత్రితో సమావేశం కానున్నట్లు రాష్ట్ర ఎన్జీవో సంఘ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు రాజమండ్రిలో తెలిపారు .ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళుతున్న ఎన్జీవో సంఘ రాష్ట్ర బృందం మార్గమధ్యంలో శుక్రవారం రాత్రి రాజమండ్రి ఎన్జీవో హోమ్ లో ఆగారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఒక బృందం శనివారం సమావేశం అవుతారని అనంతరం సోమవారం ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కానున్నట్లు తెలిపారు .ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలోనే పీఆర్సీ పరిష్కారానికి ఏపీ ఎన్జీవో సంఘం కృషిచేస్తోందని తెలిపారు .ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్ష కార్యదర్శులు గా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా రాజమహేంద్రవరం వచ్చిన బండి శ్రీనివాసరావు శివారెడ్డి లను రాజమండ్రి ఏపీ ఎన్జీవో సంఘం  సత్కరించింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎన్జీవో సంఘ అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారావు నాయుడు ప్రవీణ్ కుమార్ ఉపాధ్యక్షులు పసుపులేటి నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘం అధ్యక్షులు డి వేణు మాధవ రావు , పీటర్ తదితరులు పాల్గొన్నారు.