పంచాయతి కార్యదర్శిపై వైకాపా నేత దాడి

 

• ఉద్యోగుల ఆందోళన

 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

సెప్టెంబరు 13:  అమరావతి పంచాయతి కార్యదర్శి మోహన్ పై వైకాపా నేత మేకల హనుమంతరావు దాడి చేయడం కలకలం సృష్టించింది. వైకాపా నేత తీరుపై ఉద్యోగులు భగ్గుమన్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. దాడిని నిరసిస్తూ పంచాయతి కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. అనంతరం వైకాపా నేత హనుమంతరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.