ప్రభుత్వం, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లే గెస్ట్ లెక్చరర్ గణేష్ ఆత్మహత్య

 

 

• జూనియర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు దామెర ప్రభాకర్,  ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

సెప్టెంబరు 13:  నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోటనీ సబ్జెక్టులో గెస్ట్ లెక్చరర్ గా విధులు నిర్వర్తిస్తున్న కాసోజు గణేష్ చారి(29).. జీతాలు రాక ఆత్మహత్య చేసుకున్నారని  జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. గత 18 నెలలుగా జీతాలు, ఉపాధి లేక, ఇటు పని చేసిన 3 నెలల జీతాలు విడుదల కాక,  భౌతిక తరగతులు ప్రారంభమైనా రెన్యూవల్ రాక, ఆర్థికంగా తీవ్ర సమస్యలతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యారని చెప్పారు. దీంతో శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని  జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నార..ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, ప్రభుత్వం, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.  భౌతిక తరగతులు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైనా అన్ని కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లు సేవలు అవసరమున్నా కూడా..నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేశారన్నారు. దీంతో  గణేష్ ఆత్మహత్య కు పాల్పడినట్లు తెలిపారు.  దీనికి ముమ్మాటికి ప్రభుత్వం మరియు ఇంటర్ బోర్డు బాధ్యత వహించాలన్నారు.  గణేష్ చారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, ఇంటర్ బోర్డు స్పందించి ఇలాంటి విషాద ఘటనలు మరిన్ని పునరావృతం కాకుండా ఉండకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 405 కళాశాలల్లో ఉన్న 1654 మంది గెస్ట్ లెక్చరర్లను సత్వరమే రెన్యూవల్ చేసి, 3 నెలల పెండింగ్ జీతాలు విడుదల చేయాలన్నారు.

ఎక్కువ మందిచదివినవి