పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలి

 

• టీచర్స్ రైట్స్ ఫోరం నేత రావికంటి పవన్ కుమార్ డిమాండ్

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

సెప్టెంబరు 13: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు  చెల్లించాల్సిన  వేతన సవరణ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని 'టీచర్స్ రైట్స్ ఫోరం' తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావికంటి పవన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పీఆర్సీ బకాయిలను ఎన్నడూ ప్రభుత్వం చెల్లించకుండా ఆపలేదని, కానీ ప్రస్తుతం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ బకాయిలను చెల్లించడం లేదని విమర్శించారు.  1/4/ 2020 నుంచి 31/3/2021 వరకు 'సంవత్సరం వేతన సవరణ బకాయిలు' ఉద్యోగ విరమణ అనంతరం చెల్లిస్తామనడం గర్హనీయమని, వీటిని వెంటనే చెల్లించాలని పవన్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే రాబడి భారీగా పెరిగినందున 1/4/2021 నుంచి 30/6/2021 వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలను కూడా వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయుల జీపీఎఫ్ ఖాతాల్లో కలిపేందుకు ఏర్పాట్లు చేయాలని పవన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.