తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ కోరుకునే ఉద్యోగులకు శుభవార్త
 

•     నిరంభ్యతర ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
•     అక్టోబరు 15లోపు దరఖాస్తు చేసకోవాలని సూచన

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 14:  రాష్ర్ట విభజనలో భాగంగా తెలంగాణకు కేటాయించిన ఉద్యోగులు కొంతమంది ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత ప్రాతిపదికన బదిలీ కోరుకుంటున్న నేపథ్యంలో అటువంటి వారికి తెలంగాణ ప్రభత్వం శుభవార్త వినిపించింది. వారు దరఖాస్తు చేసుకుంటే నిరంభ్యతర ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విధివిధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం..
•    ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత ప్రాతిపదికన బదిలీ కోరుకుంటన్న ఉద్యోగులు 15‌/10/2021లోపు సంబంధిత విభాగాధిపతికి దరఖాస్తు చేసుకోవాలి. 
•    సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు, విజిలెన్స్ దర్యాప్తులు లేవని ధ్రువీకరించుకున్న తర్వాత సంబంధిత విభాగాధిపతి సదరు ఉద్యోగుల దరఖాస్తులను సిఫార్సు చేయాలి.
•    విభగాధిపతి సిఫార్సు ఆధారంగా సంబంధిత కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరంభ్యతర ధ్రువీకరణ జారీ చేయాలి. 
•    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సమ్మతి లభించిన తర్వాత సంబంధిత విభాగాధిపతి సంబంధిత ఉద్యోగిని రిలీవ్ చేయాలి. ఈ వివరాలను సర్వీసు రిజిస్టరులో నమోదు చేయాలి.   
•    ఒకసారి రీలీవ్ అయిన తర్వాత ఈ బదిలీ శాశ్వతమవుతుంది. ఇలా బదిలీ అయిన వారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ తిరిగి వెనక్కు తీసుకోవడం కుదరదు. 
•    ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత బదిలీ అయ్యే ఉద్యోగులకు ఎలాంటి టీఏ, డీఏలు వర్తించవు.