హెల్త్ సెక్రటరీలకు పరీక్షలలో మినహాయింపు ఇవ్వాలి 
 

•    అరవ పాల్

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 14:  గ్రామ, వార్డు హెల్త్ సెక్రటరీ ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ఏపీ పబ్లిక్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం డిపార్ట్ మెంటల్ పరీక్షల మినహాయింపు ఇవ్వాలని ఏపీ హంస అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు  అరవ పాల్ ఒక ప్రకటనలో ముఖ్యమంత్రిని కోరారు . వారి ప్రొటేషన్ డిక్లరేషన్ కోసం ఇతర పరీక్షలు అవసరం లేదని నిబంధనలున్నాయని, అయినా కూడా ఘనత వహించిన ఒక పెద్ద అధికారి ఇచ్చిన ఆధారం లేని నివేదిక వల్ల హెల్త్ సెక్రటరీలకు కూడా పరీక్షలు పెట్టాలని నిర్ణయించారని, ఇది సరికాదని అరవపాల్ పేర్కొన్నారు. తక్షణమే ఈ ఆలోచన విరమించుకోవాలని కోరారు.