ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల్లో కోవిడ్ నిబంధనలు అమలు చేయాలి
 

•    నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 15 : ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు, ఇన్విజిలేటర్ లకు కరోనా సోకే ప్రమాదం పొంచి ఉందని కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని  నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాస రావు ప్రభుత్వాన్ని కోరారు.
ఒక్కో పరీక్షా కేంద్రంలో 400 మంది విద్యార్థులను కేటాయించారని. ఒక్కో గదిలో 40మంది విద్యార్థులను కూర్చోపెట్టీ పరీక్షలు నిర్వహించడం  కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని  స్పష్టం చేశారు.  కోవిడ్  నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించేలా అధికారులకు తగు మార్గదర్శకాలు   వెంటనే ఇవ్వాలని కోరారు.  కొన్ని కేంద్రాల్లో థర్మల్ స్కానర్ లు కూడా లేవన్నారు.

ఎక్కువ మందిచదివినవి