విలీనం పూర్తయిన సమస్యలు అపరిష్కృతం
 

ప్రజా రవాణా ఉద్యోగుల సంఘం సమావేశం ఆందోళన
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 22- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయని ప్రజా రవాణా ఉద్యోగుల సంఘం సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.  విజయవాడలోని బస్ భవన్ లో బుధవారం ఈ సంఘం రాష్ర్ట అధ్యక్షులు కేదారేశ్వరరావు అధ్యక్షతన సమావేశమయింది. ఈ సమావేశానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, ఆస్కార్ రావులు హాజరయ్యారు. మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రజా రవాణా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తుందన్నారు. రవాణాశాఖలో ఉన్నతాధికారుల వేధింపులు, సమస్యలపై ప్రభుత్వంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తామని వారు భరోసా ఇచ్చారు. ప్రజా రవాణా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో అండగా నిలబడతామని ఆస్కార్ రావు పేర్కొన్నారు. పీఆర్ టీయూ అధ్యక్షులు కృష్ణయ్య కూడా పాల్గొని మద్దతు పలికారు. ఆర్ టీ సీ ఉద్యోగులకు అండదండలు అందిస్తామని చెప్పారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను డ్రైవర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షలు సంసాని శ్రీనివాస్  సభ దృష్టికి తీసుకువచ్చారు.