ఉద్యోగ సంఘాల పోరాట ఫలితం ..

*ఎస్ఎస్సి బోర్డ్ డైరెక్టర్ బదిలీ.... 


 ఉద్యోగ సంఘాల పోరాటం ఫలించింది .గత నెల 27వ తేదీ నుంచి గొల్లపూడి ఎస్ఎస్సి బోర్డు కార్యాలయం ముందు ఏపీఎన్జీవో రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనకు స్పందించి  రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్సి బోర్డ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి  బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. సుబ్బారెడ్డి బదిలీ చేస్తూ కె. రవీంద్రనాథ్రెడ్డికి బాధ్యతలు అప్పగించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. సుబ్బారెడ్డి మహిళా ఉద్యోగులను వేధించడం ఉద్యోగుల్లో ను చులకన భావంతో మాట్లాడడం తదితర కారణాలను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గత నెల 27వ తేదీ నుంచి ఉద్యోగులు గొల్లపూడి లోని ఎస్ఎస్సి బోర్డు కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు . ఏపీ జెఎసి ఫ్యాప్టో తదితర ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు మద్దతిచ్చాయి. సుబ్బారెడ్డిని బదిలీ చేయడం పట్ల ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు సెక్రటరీ జనరల్ హృదయ రాజులు హర్షం వెలిబుచ్చారు. అలాగే ముగ్గురు సూపర్డెంట్ ల అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిప్యూటేషన్ మీద పంపించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.