గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యతలు

• సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు

• త్వరలో ఉద్యోగులకు శిక్షణ

 

 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 

సెప్టెంబరు 23: గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వ కార్యాచరణకు ఉపక్రమించింది. తొలిదశలో 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించాలని నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వికేంద్రీకరణలో భాగంగా గ్రామ సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు అందించాలని నిర్ణయించింది. త్వరలోనే గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి రిజిస్ట్రేషన్ల సేవలపై శిక్షణ ఇవ్వనుంది.  క్షేత్రస్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు అమలు చేసేందుకు వీలుగా త్వరలో ఈ ప్రక్రియను ప్రారంభించనుంది.