ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్  బదిలీ
 

•     వెనకబడిన తరగతుల సంక్షేమ విభాగానికి బదిలీ
 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 
సెప్టెంబరు 23:  ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ను వెనకబడిన తరగతుల సంక్షేమ విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ రెవెన్యూ (దేవాదాయ) విభాగంలో ఉండగా సంక్షేమ అంశాల్లో మరింత సమన్వయం కోసం వెనకబడిన తరగతుల సంక్షేమ విభాగానికి బదిలీ చేసింది. ఈ విభాగంలో భాగంగా ఉన్న  ఆర్థికంగా వెనకబడిన వర్గాల కార్పొరేషన్లలో భాగంగా బ్రాహ్మణ కార్పొరేషన్ పని చేస్తుంది. ఈ మేరకు త్వరలోనే ఏపీ ప్రభుత్వ బిజినెస్ నిబంధనల్లో అవసరమయిన సవరణలు చేయనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది.