మాట నిలబెట్టుకుని ఉంటే అసహనం ఉండదు
 

•     మల్లాది విష్ణు వ్యాఖ్యలను ఖండించిన ఏపీసీపీఎస్ యూఎస్

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 
సెప్టెంబరు 25:  ఎంఎల్సీ ఐ.వెంకటేశ్వరరావుపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన వాఖ్యలను ఏపీసీపీఎస్ యూఎస్ ఖండించింది. రెండు రోజుల క్రితం ఐటిఐ ఉద్యోగుల సమావేశంలో సీపీఎస్, పీఆర్సీ, డీఏలపై ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యయ ఎంఎల్సీ ఐ.వెంకటేశ్వర రావు మాట్లాడారు. దీనిపై  మల్లాది విష్ణు మాట్లాడుతూ ’’మేమున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, ఐదుగురు ఎంఎల్సీలు ఏంచేస్తారు మీరు, డోంట్ టాక్ నాన్సెన్స్‘‘ అంటూ తీవ్రమైన పదజాలం ఉపయోగించారని  ఏపీసీపీఎస్ యూఎస్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సీఎందాస్, రవికుమార్  తీవ్రంగా ఖండించారు. సమస్యలను ప్రస్తావిస్తే ప్రభుత్వం దృష్టి కి తీసుకువెళతాం అని చెప్పవలసిన ప్రజాప్రతినిధులే  అసహనానికి గురిఅవడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు.  చెప్పిన మాట ప్రకారం సీపీఎస్ రద్దు చేసి ఉంటే  ఇలాంటి అసహనాలు ఉండవన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సీపీఎస్ రద్దు చేయాలని, లేని పక్షం లో రెండున్నర సంవత్సరాలుగా ఓర్పు పట్టిన ఉద్యోగ,ఉపాధ్యాయలకు ఏమి చేయాలో తెలుసని అన్నారు.