విద్యా వాలంటీర్ల నియామకం చేపట్టాలి
 

•    టీపీయూఎస్ డిమాండ్.       
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 
సెప్టెంబరు 25:  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అవసరమయిన మేర పాఠశాలలకు విద్యావాలంటీర్లను కూడా నియమించాలని వారు డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాల ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నందున ఎస్జీటీలను వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో హైస్కూల్స్ లో డిప్యూటేషన్ పై పంపడం సరికాదని అన్నారు. వారి స్దానం లో విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేయాలని కోరారు. జగిత్యాల జిల్లా లో సస్పెండయిన మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల అబివృద్ధికి తోడ్పడుతున్న ఎంఈవోలకు, ఉపాద్యాయులకు ప్రోత్సాహం ఇవ్వక శిక్షించడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు.