జస్టిస్ ఎన్.వి.రమణను మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవో నేతలు
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 
సెప్టెంబరు 28:   సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణను తెలంగాణ ఎన్జీవోల నేతలు దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో తెలంగాణ  నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్  సెంట్రల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయి కంటి ప్రతాప్,  సహాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలక నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు పుష్పగుచ్ఛం అందజేశారు.