కోల్డ్ స్టోరేజ్ లో పీఆర్సీ

 

> మాజీ మంత్రి కే ఎస్ జవహర్ విమర్శ

ఉద్యోగులకు అమలు చేయాల్సిన పీఆర్సీ ని జగన్ ప్రభుత్వం వాయిదా వేస్తున్నా ఉద్యోగ సంఘాలు మౌనం ఎందుకు వీడడం లేదని మాజీ మంత్రి కే ఎస్ జవహర్ ప్రశ్నించారు. 36 నెలలుగా పీఆర్సీ ని కోల్డ్ స్టోరేజీ లో పెట్టేశారని విమర్శించారు. అయినా ఉద్యోగులు ప్రశ్నించకపోవడం దేనికి సంకేతం అన్నారు. అధికారం లోకి వచ్చిన వారం రోజులలోనే సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ ఇంకా ఎప్పుడు మాట నిలబెట్టుకుంటారని ప్రశ్నించారు.