కంట్రోల్ లో ఉంటాం సార్...  ప్రభుత్వానికి  యాంటీ కాద్సార్...!!
 

- విలేకరుల సమావేశం ముందు ఫోన్లో ఎన్ జీ వో నేత
- వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 7-  ‘‘ సంక్రాంతి లోపు పీఆర్సీ, డీఏలు, ఇతర బకాయిలు చెల్లించకపోతే ఆందోళనకు దిగుతామని,  ఇక మా సహనాన్ని పరీక్షించవద్దంటూ’’ గురువారం విలేకరుల సమావేశం పెట్టి మరీ సంయుక్త ప్రకటనలో  ఎన్ జీ వో నేత బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు  వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే విలేకరుల సమావేశం ప్రారంభమవుతుండగా ఎవరో పెద్దల నుంచి వచ్చిన ఫోన్ వాళ్లిద్దరూ  మాట్లాడారు. అప్పటికే విలేకరుల సమావేశం కోసం కెమెరాలు సిద్ధం చేసుకుని ఉన్న మీడియాలో యాదృచ్ఛికంగా  వారి ఫోన్ సంభాషణ మొత్తం రికార్డు అయింది. ఇప్పుడు అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సంయుక్త ప్రకటనలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఎన్ జీ వో  సంఘం రాష్ర్ట అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ఫోన్లో మాట్లాడిన మాటల్లో ప్రభుత్వానికి వ్యతిరేకం కాదంటూ సర్ది చెప్పిన మాటలు రికార్డయ్యాయి. ఆ సంభాషణ యథాతథంగా....
సార్...సార్ నమస్తే సర్...సార్ సార్ సర్...
..........సార్, సార్...అదేం లేదు..
(మధ్యలో  అవతలి నుంచి మాట్లాడుతూనే ఉండటంతో అది వింటూ నిశ్శబ్దంగా...)
’’ సార్ కంట్రోల్ లో ఉంటాం సార్
"ఉంటాం ఉంటాం...కంట్రోల్ లో ఉంటాం సార్"
"అయినా కూడా మేము సంయమనం చేస్తాం సార్ ,"..
మేం కలయికే చెబుతాం కానీ, ‘‘గవర్నమెంట్ కు యాంటీగా..ఏమి ఉండదు సార్ ’’
‘‘సార్  సార్..అదేం ఉండదు సార్’’
అంటూ ఇదిగో బొప్పరాజు పక్కనే ఉన్నారు, మాట్లాడండి అంటూ ఆ ఫోను బొప్పరాజుకు అందించారు. ఆయన ఎవరెవరు అని అడిగితే బండి శ్రీనివాసరావు ‘‘ స...స...’’ అంటూ ఎవరినో ప్రస్తావించడం వినిపించింది. ఆ పేరు  పూర్తి స్పష్టంగా లేదు.