తక్షణం తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలి
 

- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్‌
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు బాగా పెరగడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా భావించాలని ఎమ్మెల్సీ  నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పెరిగిన విద్యార్థుల సంఖ్య కనుగుణంగా ఉపాధ్యాయులు అవసరమని, ఉన్న టీచర్లను సర్దుబాటు చేస్తే సమస్య తీరదని, ఇందుకోసం తక్షణం తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని కోరారు.  శుక్రవారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు  కె. జంగయ్య అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసి  ప్రసంగిస్తూ విద్యార్థుల సంఖ్యకు సరిపడే ఉపాధ్యాయుల ఏర్పాటు, పాఠశాలల పరిశుభ్రత అత్యంత ప్రాధాన్యమైందని అందుకోసం తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకంతోపాటు ప్రతి పాఠశాలకు స్వచ్ఛకార్మికులను ఏర్పాటు చేయాలని సూచించారు. ,స్వచ్ఛ కార్మికులు లేకుండా గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీలకు బాధ్యత అప్పగించి సరిపెట్టుకుంటే క్షేత్రస్థాయిలో ఆశించిన విధంగా పారిశుద్ధ్య పనులు జరగడం లేదన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసుకునేందుకు, ప్రభుత్వ విద్యను నిలబెట్టుకునేందుకు ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకునే విధంగా సంఘ కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు.
 కె. జంగయ్య మాట్లాడుతూ దసరా సెలవుల అనంతరం కరోనా రక్షణ చర్యలు పాటిస్తూ సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, అన్నిరకాల గురుకుల, కెజిబివి పాఠశాలలన్నింటిని ప్రారంభించాలని కోరారు. 
ప్రధాన కార్యదర్శి చావరవి మాట్లాడుతూ జోనల్‌ విధానం, లోకల్‌ కేడర్‌ ఆర్గనైజేషన్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించనందున విద్యాశాఖ వెంటనే సర్వీసు నిబంధనలు  రూపొందించి అన్ని స్థాయిల పదోన్నతులు పూర్తిచేయాలని అన్నారు.
అంతకు ముందు ప్రధాన కార్యదర్శి ప్రవేశపెట్టిన సంఘం  కార్యాచరణనునివేదికపై అన్ని జిల్లాల నుండి హాజరైన ప్రతినిధులు విస్తృతంగా చర్చించి ఆమోదించారు.  

రాష్ట్రకమిటీ చేసిన తీర్మానాలు 
1. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య బాధ్యతను గ్రామ పంచాయితీ/ మున్సిపాలిటిలకు అప్పగించారు. కాని 40% పాఠశాలల్లో మాత్రమే ఈ పనులు జరుగుతున్నాయి.  14% పాఠశాలల్లో మాత్రమే మరుగు దొడ్ల శుభ్రత కొనసాగుతున్నది. ఇది వాస్తవ పరిస్థితి. కాని ప్రభుత్వం మాత్రం సర్వీసు సిబ్బందిని  నియమించడం అవసరంలేదని చెప్తోంది. ప్రభుత్వ వైఖరి ఖండిస్తూ తక్షణం సర్వీసు పర్సన్స్‌ నియామకాలు చేపట్టాలి. 
2. ప్రతి నెల ఒకటిన జీతాలు చెల్లింఛేందుకు  అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలి.
3. రాష్ట్ర ప్రభుత్వం  ఇటీవల ఏర్పాటు చేసిన హరిత నిధికోసం ఉద్యోగులు,  ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులనుండి కంట్రిబూషన్‌ తీసుకొంటోంది. ఈ నిధులలో ఎక్కువ భాగం పాఠశాల పరిసరాలలో గ్రీనరీ కోసం ఉపయోగించేలా విధివిధానాలు రూపొందించాలి.  
4. మహిళలు/ బాలికలపై జరుగుతున్న దురాగతాల పట్ల  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి అత్యంత నిర్లక్ష్యంగా ఉంటోంది. నిర్బయ చట్టం తెచ్చాం... అంతా అయిపోతుంది..  అనే భ్రమలు కల్పించారు. కాని  అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు నిరుద్యోగం, సారాయి. మత్తు పదార్థాల వినియోగం అనే విషయాలను ప్రభుత్వాలు గుర్తించడం లేదు. కనుక దేశంలో మహిళల పట్ల దోరణిలో మార్పు కోసం  అప్‌గ్రేడేడ్‌ పండిత్‌, పిఈటి పదోన్నతులు కల్పింఛేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి.
6. సి. పి. యస్‌ విధానాన్ని రద్దు చేసి. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి.
సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌. రాములు, సిహెచ్‌ దుర్గాభవాని, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి ప్రధాన సంపాదకులు పి. మాణిక్‌రెడ్డి కార్యదర్శులు బి. నర్సింహారావు, యం.రాజశేఖర్‌రెడ్డి, ఎ. వెంకటి, జి. నాగమణి, ఈ. గాలయ్య, బి. రాజు, కె. రవికుమార్‌, రవిప్రసాద్‌గౌడ్‌, జి. శ్రీధర్‌, రంజిత్‌కుమార్‌, సిహెచ్‌. మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.