తూ .గో.లో ఇమ్మ్యూనైజేషన్ మహిళా అధికారిపై జేసి కీర్తి ఆగ్రహం 

మండిపడ్డ ఉద్యోగులు 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 9-తూర్పు గోదావరి జిల్లాలో వైద్య అధికారి పై ఉన్నతాధికారి నోరు పారేసుకున్నారని వైద్య ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం లో తీవ్ర జాప్యం జరుగుతోందని జిల్లా ఇమ్మ్యూనైజేషన్ మహిళా అధికారిపై జేసి కీర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వైద్య ఉద్యోగులు మండిపడ్డారు. లక్షలలో వ్యాక్సిన్ పంపిణి ఆషామాషీ కాదని స్పష్టం చేశారు. గతంలో కమిషనర్ భాస్కర్ కూడా వైద్య ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతిని గుర్తు చేస్తూ ఇలాంటి తీరు సరికాదంటున్నారు.