పింఛన్దారులకు ఒకటో తేదీనే పెన్షన్ చెల్లించాలి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 10- రాష్ట్ర ప్రభుత్వం పింఛన్దారులకు ఒకటవ తేదీన పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని దేవరపల్లి మండలం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పప్పు వెంకటరామారావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండల విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గ ఎన్నిక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పింఛనుదారులు అనేక ఆరోగ్య సమస్యలతో ఉంటారని వారికి ప్రతినెలా వచ్చే పింఛను తో మందులు కొనుక్కోవాల్సి ఉంటుందని కానీ ప్రభుత్వం పింఛన్ చెల్లింపులో ఆలస్యం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు విశ్రాంత ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులుగా కేశిరాజు సీతారామయ్య అధ్యక్షులుగా పప్పు వెంకటరామారావు కార్యదర్శిగా బండి సూర్యప్రకాశరావు కోశాధికారిగా యలమాటి సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా సయ్యద్ అలీ తలారి ఏసుదాసు సంయుక్త కార్యదర్సులుగా   గద్దే కృష్ణారావు  మాగంటి లక్ష్మి కుమారి  సభ్యులుగా కర్రి రామారావు వెంగలి కృష్ణారావు  వెలిచెర్ల సూర్యనారాయణ మూర్తి
చింతాడ సులోచన సుగుణవతి  గుమ్మడి ప్రసాదరావు  సింగలూరు సుధాకర్  ఎస్. ఈ. మేరీ వ్రతం ఈడ్పుగంటి వెంకటేశ్వర్లు
షేక్ వెంకటేశ్వర్లు ఎన్నిమయ్యారు.