కొత్త నాయకత్వంలో కొంగొత్త పోరాటం

-సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సిద్ధం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) అక్టోబరు 12 -  ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకత్వం మారింది. కొత్త నాయకత్వంతో కొంగొత్తగా పోరాట పథంలోకి దిగాలని నిర్ణయించింది. సీపీఎస్ రద్దు కోసం ఎప్పటి నుంచో వీరు పోరాడుతూ వస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంకా నెరవేరే క్రమంలోకి రాలేదు. ఈ సంఘం రాష్ర్ట కార్యవర్గం సమావేశమై పోరాట పంథాపై చర్చించింది. సంఘం కొత్త అధ్యక్షునిగా రొంగల అప్పలరాజు, సంఘం ప్రధాన కార్యదర్శిగా కరి పార్థసారధి, అదనపు ప్రధాన కార్యదర్శిగా కరిమి రాజేశ్వరరావు ఎన్నియ్యారు. ఇంతవరకు సంఘం అధ్యక్షులుగా ఉన్న రామాంజనేయులు యాదవ్ ను గౌరవ అధ్యక్షునిగా ఎన్నకున్నారు. గారవ సలహాదారుగా పఠాన్ బాజీ ఉంటారు. డిసెంబర్ 10 న మరోసారి ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ రరోజు మానవ హక్కుల దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని  సీపీఎస్ రద్దు కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడ ధర్నాచౌక్ వద్ద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. రాష్ర్టంలోని సీపీఎస్ వ్యతిరేక ఉద్యోగులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.