డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో టీఈఏ ఏర్పాటు
 

•     అధ్యక్షుడిగా ఆర్.సంతోష్ కీర్తి
•    ప్రధాన కార్యదర్శిగా టి.నాగరాజు


 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 
అక్టోబరు 12:  తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్(TEA)  రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార స్వామి ఆధ్వర్యంలో డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (TEA) యూనిట్ ఏర్పాటు చేశారు.  పాఠశాల విద్యాశాఖ డైరక్టర్  కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ యూనిట్ అధ్యక్షుడిగా ఆర్.సంతోష్ కీర్తి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా టి.నాగరాజు ఎన్నికయ్యారు.  సంఘం ఇతర ముఖ్య కార్యవర్గ సభ్యులుగా జి.రవిబాబు, ఎ.కవిత, జి.సైదానాయక్, ఎండీ.జియాఉద్దీన్, సిహెచ్.ఆదిత్య, ఎం.బాలగోపాల ప్రసాద్, ఎండీ.సమీర్, ఎన్.సాయికుమార్, ఎం.రంజన, ఎండీ.గౌస్,  కె.ఆదిశేషు కుమార్, ఎండీ. ఇమ్రోజ్, బి.వేణుగోపాల్, దీప్తి సక్సేనా, టి.శంకర్, పి.ఐ.కిరణ్, మోసిన్ అలీ ఖాన్, ఎండీ. అలీ, జి.సంతోష్, ఎ.భార్గవి, ఎండీ. ఎస్దాని, జి. వినోద్ తదితరులు ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిబ్బంది సమస్యలను ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడానికి శాయశక్తులా కేంద్ర సంఘం సహకారంతో కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ దసరా పండుగ సందర్భంగానైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు బకాయి ఉన్న మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. తమ యూనిట్ స్థాపనకు సహకరించిన కేంద్ర సంఘం అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార స్వామి , మహిళా అధ్యక్షురాలు జి నిర్మల,  కేంద్ర సంఘం కోశాధికారి గడ్డం బాలస్వామి, కేంద్ర సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి యు ఎఫ్ ఏ యాకూబ్ పాషా,   రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంజనీ కుమారి, హైదరాబాద్ అధ్యక్షుడు  కొంకటి మల్లేష్ తదితరులకు కృతజ్ఞతలు చెప్పారు.