మోడల్ స్కూల్స్ సమస్యల పరిష్కారానికి కృషి
 

•    మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్ల సంఘానికి వెంకట్రామిరెడ్డి హామీ 
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 
అక్టోబరు 12:  మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయడానికి, ఈ పాఠశాలల సిబ్బందికి 010 పద్దు కింద జీతాల చెల్లించేలా కృషి చేయాలని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్ల సంఘం ఏపీ సచివాల ఉద్యోగుల సంఘం  అధ్యక్షుడు,  ఏపీ ప్రభుత్వఉద్యోగుల  సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్... వెంకట్రామిరెడ్డిని మంగళవారం ఆయన ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు.  ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని వెంకట్రామిరెడ్డి వారికి హామీ ఇచ్చారు.  ఆ తర్వాత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి  కార్యదర్శి యస్.సాల్మన్ ఆరోక్యరాజ్ ను కలిసి మోడల్ టీచర్ల బదిలీల మీద చర్చించారు. ఆరోక్యరాజ్ స్పందిస్తూ బదిలీల ఫైలు తెప్పించుకుని అతిత్వరలో క్లియర్ చేయిస్తానని హామీ ఇచ్చారు.