త్వరలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ...ఇది పక్కా
 

-  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కే.ఆర్.వెల్లడి
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 13-  ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన త్వరలోనే అధికారికంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని, ఇది పక్కా అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు ఒక వర్తమానం పోస్టు చేశారు. వారం రోజుల్లోనే ఈ సమావేశం నిర్వహించి పీఆర్సీ, తదితర అంశాలపై ప్రభుత్వం చర్చిస్తుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న బూటకపు ప్రచారాన్ని నమ్మవద్దని పిలుపునిచ్చారు.