ప్రభుత్వం అన్ని సంఘాలను చర్చలకు పిలవాలి

- లేకుంటే జనవరి నుంచి ఆందోళన
- కొన్ని ఉద్యోగ సంఘాల పరిస్థితి కామెడీగా ఉంది
- ఉద్యోగుల సంఘం నేత ఆస్కార్ రావు
- రాజమండ్రిలో విలేకరుల సమావేశం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 13-  ఉద్యోగుల అంశాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని సంఘాలను పిలిచి చర్చించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు డిమాండ్ చేశారు. ఏవో కొన్ని సంఘాలు మాట్లాడానికి వెళ్తే అది ఉద్యోగుల ఐక్య వేదిక కాబోదని అన్నారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావుల కలయిక అనైతికమని విమర్శించారు. రాజమండ్రిలో బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం తక్షణం పీఆర్సీ, డీఏలు, ఇతర సమస్యలు పరిష్కరించకపోతే జనవరి నుంచి ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.

తక్షణమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఇంతవరకు తాము ఉద్యోగులకు సంబంధించి 26 డిమాండ్లు ముఖ్యమంత్రివి విన్నవించామని అన్నారు.  ప్రభుత్వం ప్రజల కోసం  నవరత్నాల పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఉద్యోగుల అంశాలు పదో రత్నంగా చూడాలని ఆయన కోరారు. రాష్ర్టంలో కొన్ని ఉద్యోగ సంఘాల పరిస్థితి కామెడీగా తయారైందని విమర్శించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సంఘం నేత  శ్రీకాంత్ రాజు తదితరులు పాల్గొన్నారు.