పీఆర్సీపై ప్రభుత్వం కీలక ప్రకటన

- ఈ నెలాఖరులోగా నిర్ణయం
- త్వరలోఅధికారిక చర్చలు
-  సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 13-   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  పీఆర్సీపై ప్రభుత్వం తొలిసారి కీలక ప్రకటన చేసింది.  ఈ నెలాఖరులోగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఎన్ జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలోని జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు వెళ్లి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను కలిశారు.  ధనుంజయ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలతో మాట్లాడారు.  చాలా సేపు ఈ మంతనాలు జరిగిన తర్వాత సజ్జల విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- వైకాపా ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ఉద్యోగులు నిర్వహకులుగా ఉన్నారు.  
-  వారి సంక్షేమం,భవిష్యత్తు,ఉద్యోగ భద్రతపై  ముఖ్యమంత్రి స్పష్టతతో ఉన్నారు.
- వారి విషయాల్లో  రెండడుగులు ముందే ఉండాలని జగన్ భావిస్తుంటారు.
- ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పడు ప్రయత్నిస్తూనే ఉన్నాం.
- కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం. ఆర్థిక వ్యవస్థ 
చిన్నాభిన్నమైంది
- అధికారంలోకి వచ్చిన తర్వాత 27శాతం ఐఆర్ ప్రకటించాం. దీని వల్ల రూ. కోట్ల భారం ప్రభుత్వంపై పడింది. అయినా ఇస్తూనే ఉన్నాం.
- ఈ నెలాఖరులోగా పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన ఉద్యోగుల సమస్యలు కూడా నవంబరు నెలాఖరులోపు పరిష్కరిస్తాం.