ఈ నెలాఖరులోగా పీఆర్సీపై నిర్ణయం

ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లడి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 13-  ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పీఆర్సీపై అక్టోబరు నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మిగిలిన సమస్యలు నెలాఖరులోగా పరిష్కరిస్తామని అన్నారు. ఉద్యోగుల జేఏసీ నాయకులు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళారు. ధనుంజయ్ రెడ్డి, సజ్జల వారితో చర్చలు జరిపారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెలాఖరులోగా పీఆర్సీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.