సకాలంలో వేతనాలు, పెన్షన్లు

- సీఎంవో అధికారలు హామీ ఇచ్చారు
- బండి శ్రీనివాసరావు వెల్లడి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 13-   పీఆర్సీ పై ఈ నెల్లోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించినందుకు  ఏపీ ఎన్ జీ వో రాష్ర్ట అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. సకాలంలో వేతనాలు, పెన్షన్లు వచ్చేలా చూస్తామని కూడా సీఎంవో  అధికారులు చెప్పారన్నారు.  పెండింగు బిల్లులు త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పారన్నారు. రెండు జేఏసీల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసమే రెండు ఐకాసలు కలిసి పని చేస్తాయని బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు.   సీపీఎస్ రద్దు ,ఫీఆర్సీ,ఫిట్ మెంట్  సాధన  కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు.