సచివాలయ ఉద్యోగుల కష్టాలు తీర్చండి

(ఉద్యోగులు.న్యూస్), (ఉద్యోగులు.కామ్)
మే 14- సచివాలయ ఉద్యోగంలో  చేరి నప్పటి నుంచి ప్రమాదవశాత్తు,అనారోగ్యంతో, కరోనా తో మరణించిన ప్రతి ఒక్క ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం (13‌-2020) నాయకులు డిమాండ్ చేశారు. వారి డిమాండ్లను ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డికి వినతిపత్రం రూపంలో తెలియజేశారు. ప్రభుత్వానికి విన్నవించి పరిష్కరించేలా చూడాలని కోరారు. వారి డిమాండ్లు ఇలా ఉన్నాయి.
- వైద్యానికి అయిన ఖర్చులను తిరిగి చెల్లించే ఏర్పాటు చేయాలి.
- కరోనా సోకిన సచివాలయ ఉద్యోగికి వేతనంతో కూడిన 30 రోజుల సెలవు ఇవ్వాలి.
- ఫ్రంట్ లైను వర్కరుగా గుర్తించి రూ.50 లక్షల బీమా కల్పించాలి.
- ఎవరైనా మరణిస్తే కారుణ్య నియామకం కింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
- రోజు విడిచి రోజు డ్యూటీకి అనుమతించాలి. సగం మంది ఒక రోజు మరో సగం మంది మరో రోజు డ్యూటీ చేసే అవకాశం కల్పించాలి.
- కోవిడ్ 19 హాస్పిటల్స్, ఐ.సి.యు డ్యూటీలు రద్దు చేయాలి.
- పెన్షన్ పంపిణీకి బయోమెట్రిక్ లేకుండా చూడాలి
-  సచివాలయ ఉద్యోగం చేరిన నాటి నుంచి మాతృత్వపు సెలవు వర్తించేలా సవరణ చేయాలి.
- ప్రొబెషనరీ గడువు ముగిసిన వెంటనే డిక్లరేషన్ ఆదేశాలు జారీ చేయాలి.
- సచివాలయ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు మొదట వ్యాక్సినేషన్ వేయించాలి. సచివాలయ ఉద్యోగులకు ఎన్ 95 మాస్కులు ఇవ్వాలి. శానిటైజర్లు ఇవ్వాలి.

ఎక్కువ మందిచదివినవి