Thursday 24th June 2021

సరిహద్దుల్లో  ఆంక్షలు తగవు గెజిటెడ్ అధికారుల సంఘం లేఖ

(ఉద్యోగులు.న్యూస్), (ఉద్యోగులు.కామ్)
మే 14-  ఆంధ్రప్రదేశ్ నుంచి కోవిడ్ చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లే రోగుల విషయంలో ఆంక్షలు సడలించాలని ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ అధికారుల సంఘం  నేతలు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు లేఖ రాశారు. ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షులు  కే వీ కృష్ణయ్య ,సెక్రటరీ జనరల్ అజయ్ మేడిపల్లి ఈ లేఖ రాశారు.  ఆ లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి.
- ఇతర రాష్ట్రాల కోవిడ్ పేషెంట్స్ చికిత్స నిమిత్తం హెల్త్ హబ్ గా పేరుగాంచిన  హైదరాబాద్  రావడానికి ఆంక్షలు పెట్టడం బాధాకరం.  ఆ  ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి. 
- ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ముందుగానే ఆస్పత్రులతో మాట్లాడుకుని అనుమతి తీసుకోవడం కష్టం. అత్యవసర పరిస్థితుల్లో ఇన్ని పర్మిషన్లు కావాలనడం తగదు.
- కోవిడ్ మహమ్మారికి ఎక్కడ వైద్య పొందడానికైనా ప్రతి భారతీయ పౌరుడికి హక్కు ఉంది.
- హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న అనేక మంది ఆంధ్రప్రదేశ్  వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నారు. మరికొందరు   ఏపీ నుంచి తెలంగాణ వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. రాష్ర్ట విభజన చట్టం ప్రకారం కూడా ఏపీ ప్రజలు ఉద్యోగులు ఎలాంటి ఆంక్షలు లేకుండా వైద్య సదుపాయాలు హైదరాబాద్ లో పొందే  హక్కు  ఉంది.