Thursday 24th June 2021

గర్భిణీలకు ఇంటినుంచే పనికి ఉత్తర్వులు


(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
మే 15-  ఆంధ్రప్రదేశ్ లో పోలీసుశాఖలో  పని చేస్తున్న వారిలో గర్భిణులకు ఇంటి నుంచే పని చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు రాష్ర్ట డీజీపీ గౌతం సవాంగ్ శనివారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత కరోనా కాలంలో వారికి ఈ వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ఈ ఆదేశాలు వెంటనే అమలు చేయాలని డీజీపీ పేర్కొన్నారు. మహిళా సిబ్బందిలో గర్భిణుల వివరాలను వెంటనే మంగళగిరిలోని ప్రధాన కార్యాలయానికి తెలియజేయాలని ఆ ఉత్తర్వుల్లో కోరారు.