Thursday 24th June 2021

కరోన బారినపడిన ఉద్యోగులు పెన్షనర్ల వివరాలు 31లోగా పంపాలి 

(ఉద్యోగులు.న్యూస్), (ఉద్యోగులు.కామ్)

రాష్ట్రంలో కోవిడ్ బారినపడి మరణించిన ఖజానా శాఖ ఉద్యోగులు ఖజానా శాఖ పెన్షనర్లు వివరాలను ఈ నెల 31వ తేదీ లోగా ఖజానా శాఖ డైరెక్ట్ రేటుకు పంపాలని ఆ శాఖ డైరెక్టర్ హనుమంతరావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు .ఈ మేరకు 13 జిల్లాల్లోని ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్లకు లేఖ వ్రాశారు .కరోనా సమయంలో రాష్ట్రంలోని ఖజానా శాఖ ఉద్యోగులు పింఛన్దారులు మరణించడం  బాధాకరమని అంటూ ఉద్యోగుల పింఛన్దారుల మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు వచ్చే ప్రయోజనాలను త్వరితగతిన అందించాలని డైరెక్టర్ ఆదేశించారు. ఖజానా శాఖ పరిధిలో ఎంత మంది ఉద్యోగులు పింఛనుదారులు మరణించారు వారి వివరాలు అలాగే కారుణ్య నియామకానికి అర్హత ఉన్నదా లేదా తదితర వివరాలను పంపించాలని ఖజానా శాఖ డైరెక్టర్ ఆదేశించారు.