జీవో 2 అన్ని చోట్లా తక్షణ అమలు చేయాలి

మండల అధికారులు ఆ జీవో అమలు చేయడం లేదు
- సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేత జానీ పాషా

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు. కామ్)
మే 21-  ఆంధ్రప్రదేశ్ లో  మార్చి 25న విడుదల చేసిన జీవో 2 ఇంతవరకు అమలు చేయలేదని వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి   ఎండీ జానీ పాషా పేర్కొన్నారు.ఈ జీవో ద్వారా గ్రామ పంచాయతీ గ్రేడ్ 5 కార్యదర్శులకు సింగిల్ పంచాయతీలకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించేలా ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ ఉత్తర్వులు ఇంతవరకు అమలు చేయడం లేదు. రాష్ర్ట ఉన్నతస్థాయి నుంచి కింది వరకు ఈ జీవో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా అనేక చోట్ల  మండల అధికారులు ఆ జీవోను అమలు చేయడం లేదని జానీ పాషా పేర్కొన్నారు. దీని వల్ల గ్రామ సచివాలయ వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శి సచివాలయానికి లింక్ ఆఫీసర్ అన్న బాధ్యతలో నిర్వచనం స్పష్టం చేయాలని ఆయన కోరారు.

ఎక్కువ మందిచదివినవి