Saturday 19th June 2021

కోవిడ్ సోకిన టీటీడీ ఉద్యోగులకు స్పెషల్ లీవు
 

ఉత్తర్వుల విడుదల

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

మే 22 - కోవిడ్ సోకిన టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కార్యనిర్వహణాధికారి తరపున ఈ ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు క్వారంటైన్ లో ఉన్నా, హోం ఐసోలేషన్ లో  ఉన్నా, ఆస్పత్రిలో ఉన్నా ఈ స్పెషల్ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు.  డ్యూటీలో చేరే సమయంలో డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.

ఈ ఉత్తర్వుల పట్ల తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున అధ్యక్షులు చీర్ల కిరణ్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఎక్కువ మందిచదివినవి