Thursday 24th June 2021

శాశ్వత ప్రాతిపదిక ఆక్సిజన్ ప్లాంటు టీటీడీయే ఏర్పాటు చేయాలి

- టీటీడీ ఉద్యోగ సంఘాల  జేఏసీ వినతి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

మే 22 -  టీటీడీ ఆధీనంలోని ఆస్పత్రుల్లో అవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తికి ప్లాంటును ఏర్పాటు చేసుకోవడానికి పాలకవర్గం నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాల జేఏసీ విన్నవించింది.ఈ మేరకు కార్యనిర్వహణాధికారికి వినతిపత్రం సమర్పించింది.  ఉద్యోగులకు ప్రత్యేకంగా మాధవం క్వారంటైన్ కేంద్రాన్ని,బర్ద్ హాస్పిటల్ ను ప్రత్యేకంగా ఉద్యోగులకు కోవిడ్ ఆస్పత్రిగా మార్చిన టీటీడీ ఈ విషయంపైనా దృష్టి సారించాలని ఆ కమిటీ కన్వీనర్ నాగార్జున కోరారు.  పాండిచ్చేరి,హైదరాబాద్,బళ్ళారి,నెల్లూరు,ఏర్పేడు ప్రాంతాలనుండి నిరంతరం ఆక్సిజన్ సిలండర్ల కోసం రేయింబవళ్లు టీటీడీ అధికారుల నిరంతర పర్యవేక్షణలో ఉద్యోగులు చాలా వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లి తీసుకువస్తున్నారని పేర్కొంది.  టీటీడీ ఆధీనంలోని హాస్పిటల్ లో  ఆక్సిజన్ మనమే ఉత్పత్తి చేసుకొనే  లా  ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని టీటీడీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు  మల్లారపు నాగార్జునగంపల వెంకటరణారెడ్డి, గోల్కొండ వెంకటేశం

మేడికొండప్రసాదరావు తదితరులు కోరారు.