రికార్డు స్థాయిలో తితిదే ఉద్యోగులకు  ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా
 

చీర్ల కిరణ్ వెల్లడి
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
మే 24-  రాత్రనక, పగలనక, నిద్రహారాలు మాని,కష్టాన్ని, కరోనాని సైతం లెక్కచేయకుండా, ప్రాణాలు పణంగా పెట్టి తితిదే ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబసభ్యుల కోసం హైదరాబాద్ నుంచి బర్డ్ హాస్పిటల్ కు రాను పోను 1200 వందల కిలోమీటర్లు ప్రయాణించి, 36 గంటల్లో రికార్డు స్థాయిలో 325 ఆక్సిజన్ సిలిండర్లు  ఉద్యోగులు తీసుకువచ్చారని ఆ  సంఘం నాయకుడు చీర్ల కిరణ్ తెలిపారు. ఈ ఆక్సిజన్ యజ్ఞంలో పాల్గొన్న తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, డ్రైవర్లకు, సెక్యూరిటీ గార్డులకు  ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 

ఎక్కువ మందిచదివినవి