వైద్యవిధాన పరిషత్లో ఉద్యోగులను ఆదుకునే విధానం ఏది? 

 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
మే 25-   ఏపీ వైద్య విధాన పరిషత్ లో  పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు ఎన్నాళ్లగానో పరిష్కారం కావడం లేదని ఏపీ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎంప్లాయిస్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పేర్కొంది. ఆ సంఘం రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు మర్రి బాబ్జి, పి.రవికుమార్ ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. గతంలో ఆరోగ్యశాఖ కార్యదర్శికి తెలియజేసినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ప్రతి సంవత్సరం సరెండర్ లీవ్ నగదుగా మార్చి నెలాఖరుకు చెల్లింపులు జరిగేవని పేర్కొంటూ రెండేళ్లుగా కొన్ని నెలల పాటు ఆలస్యమవుతోందని తెలిపారు. పే ఫిక్సేషన్ కు పంపిన ప్రతిపాదనలు ఎక్కడివి అక్కడే ఉంటున్నాయన్నారు. ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ లు కూడా కొన్ని నెలలు ప్రధాన కార్యాలయం లోనే ఉండటం వలన వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు కోసం ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  ట్రామాకేర్ సిబ్బందికి కొన్ని నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, అదే సమయంలో ఉద్యోగుల విధుల్లో  ఏ మాత్రం తేడా వచ్చినా అధికారులు క్షమించరాని పరిస్థితి ఉందన్నారు.  ఉద్యోగులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఏ అధికారీ సమాధానం చెప్పడం లేదన్నారు.