రెండేళ్లు పూర్తి చేసుకున్న వారిని రెగ్యులర్ చేయాలి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
మే 25 -  అక్టోబర్ 2 నాటికి రెండు సంవత్సరాలు ప్రొబేషన్ పూర్తి చేసుకుంటున్న గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు అందరినీ ఎటువంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ ( 361/2020 ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. రాజేష్,షేక్ అబ్దుల్ రజాక్ డిమాండ్ చేశారు. రెగ్యులర్ చేయడంతో పాటు పే స్కేలు వర్తింపజేయాలన్నారు. వెంటనే ఈ ఉద్యోగులందరికీ సర్వీసు రిజిష్టర్లు ప్రారంభించాలన్నారు. మార్చి 31 లోపు ఈ రిజిష్టర్లు ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినా ఇంకా అనేక చోట్ల ఆ ప్రక్రియ చేపట్టలేదని వారు పేర్కొన్నారు.