Thursday 29th July 2021

గ్రేడ్ 2  వీఆర్వోలకు ప్రమోషన్ ఇవ్వాలి
 

- ప్రొబెషనరీ సమయం తగ్గించాలి
- రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు వినతి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు. కామ్)
మే 28-  రాష్ర్టంలో గ్రేడ్ 2 వీఆర్వోలు 3,795 మందిని మొదటి గ్రేడ్ కు మార్చి  స్కేలు అమలు చేయాలని ఏపీ  వీఆర్వో అసోసియేషన్ (540 - 2020) రాష్ర్ట అధ్యక్షులు మేడిచర్ల ప్రసన్న వెంకటేష్, ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు  రెవెన్యూ మంత్రిని కోరారు. శ్రీకాకుళంలో శుక్రవారం అప్పలనాయుడు మంత్రిని  కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా వీఆర్ఏలకు వీఆర్వో ప్రమోషన్ కల్పిస్తూ జీవో 3‌9 విడుదల చేసినా ఏ ప్రభుత్వమూ అది అమలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ వీఆర్ఏలకు గ్రేడ్ 2 వీఆర్వోలుగా ప్రమోషన్ కల్పించారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 8 నుంచి 10 సంవత్సరాలు వీఆర్ఏ గా పని చేసినా గ్రేడ్ 2 వీఆర్వో పదోన్నతి వల్ల సాధించింది ఏమీ లేదన్నారు. మళ్లీ స్కేలు లేకుండానే రూ.15వేల గౌరవ వేతనానికే చాలా దూరంగా పని చేయాల్సి వస్తోందని వెంకటేష్, అప్పలనాయుడు తెలిపారు. మరో వైపు ప్రొబెషనరీ కాలం రెండేళ్లు గా పేర్కొన్నారని అన్నారు. మొత్తం 3,795 మంది గ్రేడ్ 2 వీఆర్వోలకు ఏడాది పూర్తయిన వెంటనే ప్రొబెషనరీ ఇచ్చి పే స్కేలు వర్తింపజేయాలని మంత్రికి విన్నవించినట్లు వారు తెలిపారు.