కరోనా ప్రంట్ లైన్ వారియర్స్ కుటుంబసభ్యులందరికి వ్యాక్సిన్ వేయాలి

* ప్రభుత్వాలకు కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జెఏసి విజ్ఞప్తి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు. కామ్)
మే 28- కరోనా ప్రంట్ లైన్ వారియర్స్ కుటుంబ సభ్యులకు  కరోనా మరణాల నివారణ కోసం మొదటి ప్రాధాన్యతగా వాక్సినేషన్ చేయాలని ఏపీ డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జెఏసి రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథ రెడ్డి, కడప జిల్లా జెఏసి కన్వీనర్ యస్. ఖాదర్ బాష,జిల్లా నాయకులు జి.రాజేంద్ర విజ్ఞప్తి చేశారు. రాయచోటి గవర్నమెంట్ హస్పిటల్ నందు శుక్రవారం సాయంత్రం వారు మాట్లాడుతూ  వైద్య ఆరోగ్య శాఖలోని వైద్యులు, నర్సులు పారామెడికల్ సిబ్బంది కరోనా నివారణ చర్యలు చేపట్టడంతో కరోనాతో చాలామంది మరణించారని,వారి కుటుంబ సభ్యులు కూడా బాధితులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్దతో వెంటనే సిబ్బంది కుటుంబ సభ్యులకు కూడా వాక్సినేషన్ కార్యక్రమం చేయడానికి నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేసారు. దేశ సంపదైన సాంకేతిక, వైద్యశాస్త్ర పరిజ్ఞానంతోపాటు సుశిక్షితులైన  వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ప్రభుత్వాలు, సమాజం కాపాడుకోవాలని వారు కోరారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండగలిగితే వారు సామాజిక భాద్యతతో రెట్టింపు ఉత్సాహంతో,మనోధైర్యంతో వైద్య సేవలు విస్తృతంగా చేయగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.