గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

మే 30-

అక్టోబర్ 2 నాటికి రెండేళ్లు ప్రొబేషన్ పూర్తి చేసుకోబోయే తమను ఎలాంటి షరతులు లేకుండా రేగులరైజ్ చేసి పే స్కేల్ వర్తింప చేయాలని  ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సంఘం(361/2020) కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎం. రాజేష్ , ఉపాధ్యక్షులు హరి కృష్ణ , ప్రధాన కార్యదర్శి ఎం. శేఖర్ కోరారు. కర్నూలు జిల్లా మొత్తం లో ఈ నెల 31నాటికి సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్లు ఓపెన్ చేయాలని పై అధికారుల నుంచి ఆదేశాలు  ఉన్నా కొన్ని చోట్ల ఇంకా ఆ ప్రయత్నం జరగడం లేదన్నారు.