రెసిడెంట్ డాక్టర్ల విధుల బహిష్కరణ
 

- స్టయిఫండ్ పెంపునకు డిమాండ్
- అదనపు ఆరోగ్య కార్యదర్శికి వినతిపత్రం
- జూడాలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ అని వెల్లడి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 1 -   ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట వ్యాప్తంగా మంగళవారం సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. తమ న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే  పరిష్కారించాలని వారు విన్నవించారు. అదనపు ఆరోగ్య కార్యదర్శి రవిచంద్ర,  మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రాఘవేంద్రతో వైద్యులు  వేరుగా వేరుగా భేటీ అయ్యారు. స్టయిఫండ్ పెంచాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ స్పందన ను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు.  జూనియర్ డాక్టర్లతో బుధవారం చర్చించి భవిష్యత్తు కార్యాచరణ  ప్రకటిస్తామని సీనియర్ రెసిడెంటు డాక్టర్లు వెల్లడించారు. ఆ సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ  స్టైఫండ్ పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నా స్పందన లేదన్నారు. తెలంగాణ లో‌ రూ.80వేలు ఇస్తుంటే..  తమకు రూ. 45 వేలే ఇస్తున్నారన్నారు. కరోనా‌ విధులకు.. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న విధంగా అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని, ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని వారు కోరారు.